● డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నవీన్
నర్సంపేట : ప్రభుత్వ కళాశాలలు విజ్ఞాన వేదికలుగా నిలుస్తున్నాయని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ తెలిపారు. కళాశాలలో విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కళాశాల ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీలోనే కాకుండా జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్‌రెడ్డి అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. తొలుత రాష్ట్ర స్థాయిలో జిజ్ఞాన పోటీలకు ఎంపికై న విద్యార్థులతోపాటు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులను, వివిధ సెంట్రల్ యూనివర్సిటీల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రశంస పత్రాలు, బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి సత్యనారాయణ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కళాశాల కోఆర్డినేటర్ ఎస్.కమలాకర్, సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎం.సోమయ్య, డాక్టర్ ఎం.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఉన్నతికి బాటలు
వర్ధన్నపేట : విద్యావారోత్సవాలతో విద్యార్థుల ఉన్నతికి బాటలు పడతాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పోశయ్య ఆకాంక్షించారు. ఆ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, సామాజిక సేవలు అలవర్చుకోవాలని చెప్పారు. అనంతరం మణిగె రత్నమ్మ జ్ఞాపకార్ధం ఆమె మనుమడు సాయి గగన్‌కుమార్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగానికి రూ.27 వేల విలువైన వంట పాత్రలు బహూకరించగా ఆయనతోపాటు కేంద్ర పరిశ్రమల బోర్డు మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం, పీహెచ్‌సీ ఆర్‌ఎంఓ డాక్టర్ భరత్, విశ్రాంత ఉపాధ్యాయుడు అల్లంనేని మోహన్‌రావులను ప్రిన్సిపాల్ పోశయ్య శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు సీహెచ్.రాజు, రజిత, విష్ణుకుమార్, రెడ్డప్ప, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్, స్నేహలతరెడ్డి, సంపత్‌రెడ్డి, సంధ్య, సుధారాణి, శ్వేత, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.


