పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

May 19 2026 1:22 AM | Updated on May 19 2026 1:22 AM

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

దుగ్గొండి : మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ హై స్కూల్‌లో 2008–09 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు 17 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని తన్మయత్వం చెందారు. ఆత్మీయ ఆలింగణలతో ఆనంద పరవశులయ్యారు. కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. తాము చదువుకున్న తరగతి గదుల్లో కలియదిరిగి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సందడి చేశారు. నాటి గురువులను ఆహ్వానించి శాలువాలతో సన్మానించారు. ఏటా కలుసుకోవాలని, కష్టాల్లో ఉన్న మిత్రులను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు దూలం రాజేందర్‌, సోమదాసు, సత్యనారాయణ, శ్రీనివాసచార్యులు, అరుణం, ప్రమోదిని, పూర్వవిద్యార్ధులు బలభద్ర రాజు, పరదేశి మోహనకృష్ణ, కోట వినోద్‌, రవీందర్‌, అరుణ్‌, కన్నెబోయిన కవిత, సౌజన్య, కలకోటి శివకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement