● కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్
నల్లబెల్లి : పేదల ఆరోగ్య భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ తెలిపారు. మండలంలోని నారక్కపేటకు చెందిన తిప్పని స్వరూప అనారోగ్య సమస్యలతో అప్పు చేసి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు మంజూరైంది. ఈ క్రమంలో స్వరూపకు అశోక్ ఆదివారం చెక్కు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్ నుంచి సాయం అందిస్తోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేదలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నారక్కపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీపతి సుమన్, నాయకులు పొగుల కుమారస్వామి, కుంచాల రాజు, వడ్లూరి రమేశ్, అస్సన్, కమిలి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


