వర్ధన్నపేట: పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో మార్క్‌ఫెడ్ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, నాయకులు ఎద్దు సత్యనారాయణ, వర్ధన్నపేట సొసైటీ మాజీ అధ్యక్షుడు కౌడగాని రాజేశ్‌ఖన్నా, సర్పంచ్ బేతి సాంబయ్య, మార్క్‌ఫెడ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


