హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్
చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: బడా బకాయిదారులకు తక్షణమే రెడ్ నోటీసులు అందించి పన్ను వసూలు చేయాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పరిధి 6, 7, 8 డివిజన్లలో పన్ను వసూళ్ల ప్రక్రియను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పన్ను వసూళ్ల విధానాన్ని సంబంధిత వార్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను వడ్డీ మాఫీ లేదని స్పష్టం చేశారు. నగర ప్రజలు ఈ నెల 31వ తేదీలోపు పన్నులు చెల్లించి జరిమానాల బారిన పడకుండా ఉండాలని కోరారు. 400 మంది బడా బకాయిదారులకు రెడ్ నోటీసులు అందించి వెంటనే వారి నుంచి పన్నులు వసూలు చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనవు కమిషనర్ చంద్రశేఖర్, ఈఈ మహేందర్ రెవెన్యూ అధికారి బాకం సంతోశ్‌కుమార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, వార్డు ఆఫీసర్ క్రాంతి, బిల్ కలెక్టర్లు శివ సాయి, అజయ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


