కాళోజీ సెంటర్: కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి రెండో దశ నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కాళోజీ విగ్రహం వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. జిల్లా శాఖ అధ్యక్షుడు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి సి.సుజన్ ప్రసాద రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎస్‌ఎ రవుఫ్, కార్యదర్శిలు పాక శ్రీనివాస్, నామోజు శ్రీనివాస్, తాబేటి లింగమూర్తి, కె.రమేష్, జి.కరుణాకర్, టీవీ, సత్యనారాయణ, కేజీబీవీ, యుఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు, ఉగ్యోగులు తదితరులు పాల్గొన్నారు.


