లక్ష్యం.. మిషన్ ఎక్స్‌లెన్స్
కాజీపేట అర్బన్: గురుకుల విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు మిషన్ ఎక్స్‌లెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. కాజీపేట మండలం మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ఆవరణలో శుక్రవారం గురుకుల విద్యార్థులకు 70 రోజుల ఉచిత నీట్, ఐఐటీ కోచింగ్ ‘మిషన్ ఎక్స్‌లెన్స్’ కార్యక్రమాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈఐఓ అజ్మీరా గోపాల్, డీసీఓ, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన కర్ణాటక బృందం
హన్మకొండ అర్బన్: నగరంలోని యూత్ హాస్టల్‌లో జరుగుతున్న అంతర్రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక బృందం శుక్రవారం హనుమకొండ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో కొత్తవాడలో జరీ వస్త్ర పరిశ్రమను సందర్శించారు. రంగశాయిపేటలోని వారాహి హోమ్ ఫుడ్స్‌ను సందర్శించి తెలంగాణ పిండి వంటల గురించి తెలుసుకున్నారు. హంటర్‌రోడ్డులోని తాళ్లపద్మావతి ఫార్మసీ కళాశాలలో కల్చరల్ ప్రోగ్రాంకు హాజరయ్యారు.
ఓటు హక్కును వినియోగించుకోవాలి..
ప్రజాస్వామ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కోరారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని క లెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించా రు. అనంతరం అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
పరిమితి దాటిన వాహనాలపై చర్యలు
కాల పరిమితి ముగిసిన వాహనాలపై సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
గురుకుల విద్యార్థులకు ఉచిత శిక్షణ


