వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం
గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలిలో నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారి ఆలయం వద్దకు తరలిరాగా మంగళ వాయిధ్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణ మద్య అమ్మవార్లు వల్లీదేవి, దేవసేనా దేవీలతో కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు, అర్చకులు శ్రీహర్షలు ప్రత్యేక పూజలు చేసి కల్యాణం జరిపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.


