దుగ్గొండి: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గత సంవత్సరం నవంబర్ 6 నుంచి 28వ తేదీ వరకు సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1.79 లక్షల కుటుంబాలను 1,200 మంది ఎన్యుమరేటర్లు, 119 మంది సూపర్‌వైజర్‌లు సర్వేలో పాల్గొన్నారు. ప్రతీఒక్క ఎన్యుమరేటర్ 150 ఇళ్లలో సర్వే చేశారు. డిసెంబర్ 10 వరకు డాటాను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేశారు.
అందని వేతనాలు..
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా పనిచేసిన ఎన్యుమరేటర్‌లకు రూ. 10 వేలు, సూపర్‌వైజర్‌లకు 12వేల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే చేసిన అనంతరం వివరాలను కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేసే డాటా ఎంట్రీ ఆపరేటర్‌లకు దరఖాస్తుకు రూ.30 చొప్పున చెల్లించాల్సి ఉంది. సర్వే పూర్తై ఏడాది గడిచినా.. ఒక్కపైసా రాలేదని, తాము నిద్రాహారాలు మాని పనిచేశామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి సర్వే కోసం రూ.168 కోట్లు విడుదల చేశామని జనవరి నెలలో ప్రకటించారు. అయినా నేటికి అడుగు ముందుకు పడలేదు. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి సర్వే వేతనాలు విడుదల చేయాలని ఎన్యుమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు కోరుతున్నారు.
నిధులు విడుదల చేయాలి
సర్వే సందర్భంగా దరఖాస్తులు అప్‌లోడ్ చేయడానికి డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేశాను. ఒక్కో దరఖాస్తుకు రూ.30 చొప్పున మొత్తం 692 అప్‌లోడ్ చేశాను. రూ.20,760 రావాల్సి ఉంది. డబ్బుల కోసం అనేకసార్లు మండలకేంద్రానికి ఎంపీడీఓను కలిశాను. ఇంతవరకు డబ్బులు రాలేదు. ఉన్నతాధికారులు స్పందించి నిధులు విడుదల చేయాలి.
– జటబోయిన శివ,
నాచినపల్లి, డాటా ఎంట్రీ ఆపరేటర్లు
ఏడాదికాలంగా ఎదురుచూపులు
ఆందోళనలో ఎన్యుమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు
అందని సర్వే వేతనాలు
అందని సర్వే వేతనాలు
అందని సర్వే వేతనాలు


