భూగర్భ జలాలు ౖపైపెకి! | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాలు ౖపైపెకి!

Nov 4 2025 8:11 AM | Updated on Nov 4 2025 8:11 AM

భూగర్భ జలాలు ౖపైపెకి!

భూగర్భ జలాలు ౖపైపెకి!

భారీ వర్షాలకు పెరిగిన నీటి మట్టాలు

ప్రస్తుతం 2.66 మీటర్ల లోతులో నీరు

యాసంగి సాగుకు ఢోకాలేనట్టే..

జిల్లాలో 2,53,420 ఎకరాల్లో సాగు

జూన్‌లో 153.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 113.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో 271.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 312.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే జూన్‌లో 26 శాతం లోటు వర్షపాతం ఉండగా, జూలైలో 15 శాతం అదనంగా వర్షం కురిసింది. ఆగస్టు ఒకటి నుంచి 31వ తేదీ వరకు 248.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 390.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సెప్టెంబర్‌ నెలలో 174.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 245.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్టోబర్‌ నెలలోనూ 353.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూసుకుంటే జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ కలుపుకుంటే 1,000 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 1,455.6 మిల్లీమీటర్లు కురిసింది. దీంతో భూగర్భజల మట్టాలు ౖపైపెకి వస్తున్నాయి. అయితే అక్టోబర్‌ నెలాఖరున దంచికొట్టిన వానతో నవంబర్‌లో ఇంకా భూగర్భజలమట్టంపైకి వచ్చే అవకాశముంది.

సాక్షి, వరంగల్‌: జిల్లాలో భారీగా కురిసిన వర్షాలతో భూగర్భ జల మట్టాలు గణనీయంగా పెరిగాయి. జూన్‌లో సగటున 5.98 మీటర్ల లోతున నీరు ఉంటే జూలైలో 5.66 మీటర్లు, ఆగస్టులో 3.14 మీటర్లకు చేరుకుంది. అక్టోబర్‌ మాసం వచ్చేసరికి 2.66 మీటర్ల లోతు సగటుకు చేరుకుంది. ఇటీవల కురిసిన తుపాను ప్రభావంతో నవంబర్‌ మాసంలో భూగర్భ జల మట్టం ఇంకా పైకివచ్చే అవకాశం ఉందని భూగర్భ జలమట్ట విభాగాధికారులు భావిస్తున్నారు. ఈ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు నిండి ఆయా ప్రాంతాల్లోని భూగర్భజల మట్టాలు ఉబికాయి. ఈ వర్షాలతో వ్యవసాయానికి నీటికి ఢోకా ఉండకున్నా...పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది.

జిల్లాలో 2,53,420 ఎకరాల్లో సాగు..

జిల్లాలో 2,84,375 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 2,53,420 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో పత్తి 1,18,106, వరి 1,03,160, మొక్క జొన్న 13,654, ఇతర పంటలు 18,500 ఎకరాల్లో సాగు చేశారు. అయితే అక్టోబర్‌ నెలాఖరులో అతి భారీ వర్షాలు కురవడంతో అన్ని పంటలకు తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా పంటల నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక పంపించే పనిలో ఉన్నారు.

మండలాల వారీగా భూగర్భజల మట్టం (మీటర్లలో..)

మండలం జూన్‌ జూలై ఆగస్టు సెప్టెంబర్‌ అక్టోబర్‌

చెన్నారావుపేట 1.46 0.32 0.12 0.01 0.28

దుగ్గొండి 4.71 3.53 0.21 0.15 0.25

గీసుకొండ 5.03 4.67 1.26 0.61 0.81

ఖానాపురం 3.34 2.92 0.69 1.06 0.91

నల్లబెల్లి 7.70 7.33 1.25 0.97 0.48

నర్సంపేట 4.97 4.10 1.15 1.60 1.63

నెక్కొండ 2.85 0.48 0.19 –0.43 0.25

పర్వతగిరి 11.65 13.51 7.66 6.58 4.27

రాయపర్తి 8.06 9.63 7.05 4.17 6.14

సంగెం 3.58 3.12 2.26 2.52 2.73

వర్ధన్నపేట 8.30 7.33 5.65 5.52 6.29

వరంగల్‌ 2.22 1.81 1.21 1.27 2.15

ఖిలా వరంగల్‌ 4.65 3.87 1.70 0.32 2.53

వానలు దంచి కొట్టడంతో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement