కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
పర్వతగిరి: రైతులు దళారులకు ధాన్యం విక్రయించి ఇబ్బందులు పడకూడదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని డీఆర్‌డీఏ పీడీ రాంరెడ్డి సూచించారు. సోమవారం మండలంలోని అన్నారం, రావూరు, కల్లెడ, పర్వతగిరి, మాల్యాతండా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. తేమ 17శాతం మించకుండా ఎండబెట్టి, తాలు, మట్టి లేకుండా తీసుకురావాలన్నారు. అనంతరం మండలంలోని ఏనుగల్, కొంకపాక గ్రామాల్లోని గోదాంలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ మాలోతు శంకర్‌నాయక్, ఏపీఎం రాజీరు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఆర్డీఎఫ్ విద్యార్థులు
పర్వతగిరి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్–19 బాలికల విభాగంలో సాఫ్ట్‌బాల్, క్యారమ్స్‌లో ఆర్డీఎఫ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆడెపు జనార్దన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో కల్లెడ గ్రామానికి చెందిన వనితా అచ్యుతాపాయి, క్యారమ్స్ విభాగంలో పి. హారిక, సాఫ్ట్‌బాల్ విభాగంలో రాజేశ్వరి, వెన్నెల, స్రవంతి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ జనార్దన్, అకాడమిక్ హెడ్ ప్రవీణ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రాజు, ఏఓ సతీష్, అధ్యాపకులు విద్యార్థినులు అభినందించారు.
7 నుంచి
వార్షిక సర్జికల్ కాన్ఫరెన్స్
ఎంజీఎం: ఈనెల 7, 8, 9 తేదీల్లో వరంగల్ కేంద్రంగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వరంగల్ చాప్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ వార్షిక సర్జికల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర శాఖ చైర్మన్ డాక్టర్ మోహన్‌దాస్, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజు సిద్ధార్థ తెలిపారు. సోమవారం ఎంజీఎంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈకాన్ఫరెన్స్ మొదటి రోజు ఏడో తేదీన కాకతీయ మెడికల్ కాలేజీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సర్జన్స్ లైవ్ ప్రజెంటేషన్ ఉంటుందని, 8, 9 తేదీల్లో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణతోపాటు దేశంలోని వివిధ వైద్య కళాశాల నుంచి వచ్చే వైద్య నిపుణులు పరిశోధన పత్రాలను ప్రజెంట్ చేస్తారని తెలిపారు. సుమారు వంద మంది వైద్యులు హాజరయ్యే ఈకాన్ఫరెన్స్‌ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో వైద్యులు వి.శ్రీనివాస్‌గౌడ్, గోపాల్‌రావు, కూరపాటి రమేశ్, నాగేందర్‌రావు, ముక్క గోపీనాథ్, నరేశ్‌కుమార్, ఎన్.వి.ఎన్ రెడ్డి, జి.రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన ఎంజీఎం సూపరింటెండెంట్
న్యూశాయంపేట: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్.పి.హరీశ్‌చంద్రారెడ్డి సోమవారం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశా రు. పూలమొక్కను అందజేశారు.
							కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
							కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
							కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
