నష్ట తీవ్రతను అంచనా వేయాలి
రాయపర్తి: అధికారులు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం మండలంలోని కొండూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కొండూరు, ఊకల్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నష్ట తీవ్రతను అంచనా వేయడానికి వ్యవసాయ, రెవె న్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, రైతులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ మండలంలో చెరువుల్లో నీటి సామర్థ్యం, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఆధారంగా ప్రజల రాకపోకలకు కాజ్‌వే, బ్రిడ్జిల ఏర్పాటుకు ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం విక్రయానికి వచ్చే సమయంలో తేమశాతం, నాణ్యతా ప్రమాణాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లంద మార్కెట్ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, తహసీల్దార్ శ్రీని వాస్, ఏఓ గుమ్మడి వీరభద్రం, ఐబీఏఈ బాలదా సు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది..
కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
కలెక్టర్ సత్యశారద


