నిర్మించారు.. వదిలేశారు..
నర్సంపేట: నర్సంపేట కూరగాయల మార్కెట్ వారంతపు సంతకు ప్రాధాన్యం ఉంది. జిల్లాలోనే చిరు వ్యాపారులు, కొనుగోలుదారులు అత్యధికంగా ఉన్న నర్సంపేట కూరగాయల మార్కెట్‌లో అసౌకర్యాలు నెలకొన్నాయి. అంగడి ఆవరణలో సమీకృత మోడల్ కూరగాయల భవనాన్ని రూ.2కోట్ల వ్యయంతో నిర్మించి 2021 మే 28న ప్రారంభించారు. సరైన పద్ధతిలో నిర్మాణం జరగకపోవడంతో చిరు వ్యాపారులు అందులోకి వెళ్లాలంటేనే అయిష్టత చూపుతున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గెలిచిన తర్వాత ఎలాగైనా భవనాన్ని చిరు వ్యాపారస్తులకు ఉపయోగపడే విధంగా చూడాలని భావించడంతో కొన్ని మార్పులు చేసి పనులు పూర్తి చేశారు. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో భవనం వినియోగంలోకి రావడం లేదు. ప్రతీ ఆదివా రం వారంతపు సంతతో పాటు ప్రతీ రోజు కూరగా యల వ్యాపారస్తులు క్రయవిక్రయాలు జరుపుతుంటారు. భవనం అందుబాటులోకి రాకపోవడంతో అంగడి ప్రాంగణంలోనే కూరగాయల విక్రయాలు కొనసాగిస్తూ వర్షంలో తడుస్తూ, ఎండకు ఎండుతూ ఇబ్బందులు పడుతున్నా రు. దీంతో పాటు అంగడి సమీపంలోనే రూ.7.50 లక్షల వ్యయంతో నిర్మించిన రేకుల షెడ్డు ను కూడా వ్యాపారస్తులకు కేటాయించకపోవడంతో వృథాగా మారింది. నర్సంపేట ప్రధాన రహదారిపై వ్యాపారాలు కొనసాగిస్తుండటంతో ఆ రహదారి గుండా భద్రాచలం, మహబూబాబాద్, వరంగల్‌కు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
నిధులు వృథా..
నాలుగేళ్ల క్రితం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా పనులు ప్రారంభించినప్పటికీ అనుకున్న సమయంలో పనులు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ పనులు నామమాత్రంగా పూర్తి చేసి నిధులు దుర్వినియోగం చేశారని, వ్యాపారస్తులకు అనుగుణంగా నిర్మించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే మాధవరెడ్డి చొరవతో మున్సిపాలిటీ నిధులను కేటాయించి రీ మోడలింగ్ చేశారు. అయినప్పటికీ వ్యాపారస్తులకు అప్పగించడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు.
నిరుపయోగంగా
మోడల్ కూరగాయల మార్కెట్ భవనం
రూ.2కోట్లతో నిర్మాణం
ఇబ్బందుల్లో చిరువ్యాపారులు
							నిర్మించారు.. వదిలేశారు..

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
