విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
నర్సంపేట రూరల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన అన్నారు. చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామాన్ని సోమవారం ఆమె సందర్శించారు. గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించి గ్రామాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మల్టీపర్పస్ వర్కర్లు పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటి చెత్త అప్పుడే తొలగించి డంపింగ్‌యార్డుకు తరలించాలన్నారు. జీడిగడ్డతండాలో ట్రాలీ ఆటో మరమ్మతుకు గురైందని, ఆ ఆటోను మూలనపడేశారని మా దృష్టికి వచ్చిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ మండల పంచాయతీ అధికారి రాంమోహన్, పంచాయతీ కార్యదర్శి కత్తెరపల్లి రాజు, మల్టీపర్పస్ వర్కర్లు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి కల్పన


