చేపపిల్లల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలి
● వీసీలో మంత్రి వాకిటి శ్రీహరి
న్యూశాయంపేట: చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మత్స్యశాఖపై జిల్లాల కలెక్టర్‌లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేపపిల్లలు చెరువులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో ఒక రిజర్వాయర్, 70 పెరినీయల్ చెరువులు, 635 సీజనల్ చెరువుల్లో 1.93 కోట్ల చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. వీసీలో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, సీనియర్ అసిస్టెంట్ రియాజ్ అహ్మద్‌ఖాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


