నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 4న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి తెలిపారు. ప్రగతినగర్, రెవెన్యూ కాలనీ, రామకృష్ణ కాలనీ, నాగేంద్ర నగర్, జులైవాడ, ప్రణయభాస్కర్ కాలనీ, ప్రశాంత్‌నగర్, రిజిస్ట్రేషన్ ఆఫీస్, సిద్ధార్థనగర్, పీజీఆర్ అపార్ట్‌మెంట్స్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. వరంగల్ ఉర్సు బొడ్రాయి, కామునిపెంట, జన్మభూమి జంక్షన్, శాకరాసికుంట ప్రాంతంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.


