ఉద్యోగ సంఘాల ఔదార్యం
హన్మకొండ అర్బన్: వరద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చిన ఉద్యోగ సంఘాలను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అభినందించారు. టీఎన్జీఓ, టీజీఓ, ట్రెస్సా, జిల్లా అధికారుల వెల్ఫేర్ సంఘం, పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఐటీఐ తదితర సంఘాల సహకారంతో 500 నిత్యవసర సరుకుల కిట్లు, బెడ్ షీట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఉద్యోగులు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారికి కావాల్సిన నిత్యవసర సరుకులు, బెడ్ షీట్లు అందజేయడం అభినందనీయమన్నారు. ఇందుకు సహకరించిన టీఎన్జీఓ, టీజీఓ, ట్రెస్సా, పంచాయతీరాజ్ మిషన్ భగీరథ, తదితర సంఘాల నేతలను అభినందించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్, టీజీఓ అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాసకుమార్, సహకార శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన్‌రావు, డీఆర్డీఓ పీడీ మేన శ్రీనివాస్, ట్రెస్సా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, కాజీపేట తహసీల్దార్ భావ్‌సింగ్, ఆసనాల శ్రీనివాస్, జిల్లా ఉద్యోగ సంఘాల నేతలు డాక్టర్ ప్రవీణ్, బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్, పనికిల రాజేశ్, పోలురాజు, దాస్య నాయక్, రాజ్యలక్ష్మి, ఎంపీడీఓల సంఘం నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీఓల సంఘం నాయకులు రఘుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అభినందించిన కలెక్టర్


