7 నుంచి వార్షిక సర్జికల్ కాన్ఫరెన్స్
ఎంజీఎం: ఈనెల 7, 8, 9 తేదీల్లో వరంగల్ కేంద్రంగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వరంగల్ చాప్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ వార్షిక సర్జికల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర శాఖ చైర్మన్ డాక్టర్ మోహన్‌దాస్, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజు సిద్ధార్థ తెలిపారు. సోమవారం ఎంజీఎంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈకాన్ఫరెన్స్ మొదటి రోజు ఏడో తేదీన కాకతీయ మెడికల్ కాలేజీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సర్జన్స్ లైవ్ ప్రజెంటేషన్ ఉంటుందని, 8, 9 తేదీల్లో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణతోపాటు దేశంలోని వివిధ వైద్య కళాశాల నుంచి వచ్చే వైద్య నిపుణులు పరిశోధన పత్రాలను ప్రజెంట్ చేస్తారని తెలిపారు. సుమారు వంద మంది వైద్యులు హాజరయ్యే ఈకాన్ఫరెన్స్‌ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. సమావేశంలో వైద్యులు వి.శ్రీనివాస్‌గౌడ్, గోపాల్‌రావు, కూరపాటి రమేశ్, నాగేందర్‌రావు, ముక్క గోపీనాథ్, నరేశ్‌కుమార్, ఎన్‌వీఎన్ రెడ్డి, జి.రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


