విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
ఎల్కతుర్తి: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం భీమదేవరపల్లి మండలం మంగరలోని పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హాస్టల్‌ను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. క్రమశిక్షణ పాటిస్తూ హాస్టల్ జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. మార్కుల కోసం కాకుండా జ్ఞానం సంపాదించేందుకు చదువుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యాన్ని ప్రసాదిస్తూ పరీక్షల భయం వల్ల నిరుత్సాహానికి లోనుకావొద్దన్నారు. సమస్యలు ఎదురైతే ఉపాధ్యాయులు, అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరారు. హాస్టల్, క్లాస్‌రూమ్‌లు, బాత్రూమ్‌లు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సోషల్ మీడియా ప్రభావం ఉన్నప్పటికీ పిల్లలపై దాని ప్రభావం తగ్గించేందుకు తల్లిదండ్రులతో మమకారం పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి, క్రమశిక్షణతో చదివి మంచి విజయాలు సాధించాలని ప్రోత్సహించారు. అనంతరం వంటకాలను పరిశీలించి కలెక్టర్ భోజన నాణ్యతపై సూచనలిచ్చారు. సమయానికి భోజనం అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు సమీపిస్తుండడంతో శ్రద్ధగా చదువుకోవాలని విద్యార్థులను ఉత్సాహపర్చారు. కార్యక్రమంలో ఎంఈఓ సునితారాణి, పాఠశాల ప్రిన్సిపాల్ అఫ్రీన్ సుల్తానా, వంగర ఎస్సై దివ్య పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి


