ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టాలి
● డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్
నెక్కొండ: వరుస వర్షాలకు తోడు మోంథా తూపానుతో గ్రామాలు, గిరిజన తండాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే పకడ్బందీగా చేపట్టాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్ అన్నారు. మండలంలోని నెక్కొండ, అలంకానిపేట పీహెచ్‌సీల పరిధిలోని పలు గ్రామాల్లో కొనసాగుతోన్న సర్వే, వైద్య శిబిరాలను గురువారం ఆయన సందర్శించి, మాట్లాడారు. ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సర్వే రిపోర్టు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు నివేదించాలని సూచించారు. ప్రసవ సమయం సమీపించిన గర్భిణులకు అత్యవసర వైద్యసేవలు అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రెడ్లవాడలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శంచిన ఆయన రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారులు రహేలా తన్వీర్, సుమన్, అఖిల్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


