మద్యం లాటరీ ప్రక్రియ విజయవంతం
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. వరంగల్ ఉర్సుగుట్ట నాని గార్డెన్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో జిల్లా ఎకై ్సజ్‌శాఖ సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్ నేతృత్వంలో మొత్తం 57 షాపులకు పారదర్శకంగా లక్కీడ్రా పద్ధతిన లైసెన్స్‌దారుల ఎంపిక ప్రక్రియను సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరై 57 షాపులకు లాటరీ పద్ధతిలో లక్కీడ్రా తీసి విజేతలను ప్రకటించారు. ఆశావహులు వేలాదిగా తరలిరాగా.. అధికారులు భారీ డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటు చేసి ప్రత్యక్షప్రసారం చేశారు. జిల్లాలో మొత్తం 57 షాపులకు 1,958 దరఖాస్తులు వచ్చాయి. నర్సంపేటలో 22 షాపులకు 755, పరకాలలో 20 షాపులకు 691, వర్ధన్నపేటలో 15 షాపులకు 512 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.58.74కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చింది. జిల్లాలో ఒక్కో దుకాణానికి సరాసరి 16షాపులు తగ్గకుండా దరఖాస్తులు రాగా.. నడికూడ వైన్స్‌కు 100 దరఖాస్తులు రావటం గమనార్హం. డ్రా పద్ధతిలో దుకాణం దక్కించుకున్న వారు 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఎకై ్సశాఖ అధికారులు ఆదేశించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతన షాపులను ప్రారంభించాలన్నారు. నడికూడ 42వ నంబర్ షాపునకు 100 దరఖాస్తులు రాగా, జి.రమణరెడ్డి విజేతగా నిలిశారు. లాటరీ ప్రక్రియలో నర్సంపేటకు చెందిన జి.సాంబలక్ష్మి నర్సంపేట 5వ షాపును దక్కించుకోగా, ఆమె భర్త జి.రాజేశ్వర్‌రావుకు ఆత్మకూరులో 38వ షాపును లాటరీ డ్రాలో సొంతం చేసుకున్నాడు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్స జ్ శాఖ ఇన్‌స్పెక్టర్లు తాతాజీ, నరేష్‌రెడ్డి, స్వరూప, మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రెండు షాపులు దక్కడం
అదృష్టంగా భావిస్తున్నాం..
మాది నర్సంపేట పట్టణం. 25 ఏళ్లుగా మద్యం షాపులు నిర్వహిస్తున్నాం. మేమిద్దరం మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోగా, మాకు నర్సంపేట 5వ షాపు, ఆత్మకూరులో 38వ షాపు దక్కాయి. దీన్ని అదృష్టంగా భావిస్తున్నాం.
– రాజేశ్వర్‌రావు, సాంబలక్ష్మి దంపతులు
57 షాపులకు లక్కీడ్రా
విజేతలను ప్రకటించిన
అదనపు కలెక్టర్ సంధ్యారాణి
జిల్లాలో దరఖాస్తులపై
రూ.58 కోట్ల ఆదాయం
నడికూడ వైన్స్‌కు అధికంగా
100 దరఖాస్తులు
మద్యం లాటరీ ప్రక్రియ విజయవంతం
మద్యం లాటరీ ప్రక్రియ విజయవంతం


