
క్రీడా పోటీలతో స్నేహపూర్వక సంబంధాలు
వరంగల్ స్పోర్ట్స్: క్రీడా పోటీలతో వ్యక్తుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడుతాయని హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్ అన్నారు. హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలోని టెన్నిస్ గ్రౌండ్‌లో శనివారం లాన్‌టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో అశోక్‌కుమార్ మాట్లాడారు. అనంతరం విజేతలుగా నాగయ్య(ఏసీపీ), శ్రీధర్(ఆర్‌ఐ) జట్టు నిలవగా, రన్నరప్‌గా నిలిచిన రడం శ్రీనివాస్, తిప్పాని సాత్విక్‌ల జట్టుకు అఽతిథులు ట్రోపీలు అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ ఏసీపీ నర్సింహరావు, టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నల్ల సురేంద్‌రెడ్డి, ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి, సంఘం ప్యాట్రన్ రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్: పంజాబ్ రాష్ట్రంలోని తల్వండిలోని గురు కాశి విశ్వవిద్యాలయంలో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ చాంపియన్‌షిప్–2025 పోటీలకు దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్‌సైన్‌న్స్ డిగ్రీ కళాశాల విద్యార్థి మహమ్మద్ తన్వీర్ కౌసర్ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఈ పోటీలు అక్టోబర్ 24–31వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
కేయూ క్యాంపస్: తెలంగాణ బంద్ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన వివిధ పరీక్షల నిర్వహణ తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ పరీక్షల విభాగం అధికారులు శనివారం ప్రకటించారు. దూరవిద్య సీఎల్‌ఐఎస్‌సీ పరీక్షలను ఈనెల 24న, మూడేళ్ల లాకోర్సు మొదటి, ఐదవ సెమిస్టర్ పరీక్షలు, ఐదేళ్ల లాకోర్సు ఐదవ, తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 21న నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం తెలిపారు. ఐదేళ్ల ఎమ్మెస్సీ బఝెటెక్నాలజీ, కెమిస్ట్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25న, ఎంటెక్ రెండవ సెమిస్టర్ పరీక్షను ఈనెల 31న నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
హన్మకొండ: బీసీ బంద్‌తో ఆర్టీసీకి నష్టం జరిగింది. బస్సులన్నీ మధ్యాహ్నం వరకు డిపోలోనే ఉండిపోవడంతో ఒక్క రోజులో రూ.1.50 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో 950 బస్సులు ప్రతీరోజు 4 లక్షల కిలో మీటర్లు తిరిగి సగటున రూ.2.30 కోట్ల ఆదాయం వస్తుంది. మధ్యాహ్నం తర్వాత బస్సులు తిరిగినా ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీపావళి పండుగ సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్లాలని బస్ స్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. అధిక చార్జీలు చెల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.
హన్మకొండ అర్బన్: జిల్లా టీఎన్‌జీఓస్ యూనియన్ అధ్యక్షుడు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు శనివారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలిపిన వారిలో యూనియన్ బాధ్యులు పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేష్, శ్యామ్ సుందర్, లక్ష్మీప్రసాద్, రాజేష్ ఖన్నా, కలకోట్ల భారత్, ప్రణయ్, పృథ్వి,సుధాకర్, నాగరాణి, గ్రేస్ ఉన్నారు.

క్రీడా పోటీలతో స్నేహపూర్వక సంబంధాలు