
అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి
నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులు, నోటీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవ కథఽనాల ద్వారా అక్రమాలను వెలికితీస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికై నా సాక్షిపై అక్రమంగా పెట్టిన కేసులు, నోటీసులను వెనక్కి తీసుకోవాలి.
–గుగ్గిళ్ల పీరయ్యమాదిగ,
ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి