
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు..
స్టేషన్‌ఘన్‌పూర్: పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి మీడియాలో ఏపీ ప్రభుత్వం పోలీసులతో సోదాలు, దాడులు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికారంగంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న దాడి అనాగరికం. పత్రికా స్వాతంత్య్రం అత్యంత కీలకం. సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదు.
– మంగు జయప్రకాశ్, టీఎస్ యూటీఎఫ్
జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు, స్టేషన్‌ఘన్‌పూర్