
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
న్యూశాయంపేట: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ డాక్టర్ సత్యశారద జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి జరుపుకుంటామన్నారు. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖశాంతులతో పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాక్షించారు.
వికసించిన బ్రహ్మకమలం
నర్సంపేట: హిందు సంస్కృతిలో బ్రహ్మకమలం మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. బ్రహ్మకలాలను శివుడికి సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పట్టణంలోని ఎర్ర జగన్‌మోహన్‌రెడ్డిఊర్మిళ దంపతుల ఇంట్లో బ్రహ్మ కమలం ఆదివారం రాత్రి వికసించింది. దీంతో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో
అయ్యప్ప పడిపూజ
నర్సంపేట: పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం భక్తి శ్రద్ధల నడుమ పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు దేవేష్‌మిశ్రా బృందం ఆధ్వర్యంలో కట్కూరి స్వప్నరాంరెడ్డి కుటుంబ సభ్యులు పడిపూజలో పాల్గొని పూజలు చేశారు. అయ్యప్పస్వామిని గురుస్వాములతో అలంకరణ చేసి పసుపు, కుంకుమ, పుష్పాలు, పాలకాయ సమర్పించారు. పంచలోహ విగ్రహాన్ని శిరస్సుపై ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పాలు, పెరుగు, తేనె, పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో శింగిరికొండ మాధవశంకర్, సైఫా సురేష్, దొడ్డ రవీందర్, బండారుపల్లి చెంచారావు, ఇరుకుళ్ల వీరలింగం, పాలకుర్తి శ్రీనివాస్, అనంతుల రాంనారాయణ, మల్యాల రాజు, దొడ్డ వేణు, తదితరులు పాల్గొన్నారు.
పాకాలలో
పర్యాటకుల సందడి
ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వచ్చారు. పాకాల అందాలను వీక్షించి లీకేజీ నీటిలో, పార్కులో సరదాగా గడిపారు. బోటింగ్ చేస్తూ సందడి చేశారు.
కష్టపడిన వారికే పదవులు
నర్సంపేట: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తకే పదవులు లభిస్తాయని ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోత్ పట్నాయక్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని సిటిజన్ క్లబ్‌లో ఆదివారం డీసీసీ ఎన్నిక ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పార్టీలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వారు డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తుంటారన్నారు. జిల్లా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేది డీసీసీలేనన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు చేసుకుంటే అధిష్టానం పరిశీలిస్తుందన్నారు. ప్రతీఒక్కరూ సమన్వయంతో పని చేసుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ముందుగా నర్సంపేట క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు, ఎమ్మెల్యే మాధవరెడ్డి సమావేశమయ్యారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో పీసీసీ పరిశీలకులు రేణుక, ఆదర్శ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు