
మానసిక దివ్యాంగులకు సత్వర న్యాయసేవలు
హనుమకొండ జిల్లా న్యాయమూర్తి
డాక్టర్ పట్టాభిరామారావు
హన్మకొండ అర్బన్: మానసిక దివ్యాంగులకు సత్వర నాయసహాయం అందించేందుకు మనో న్యాయ్ లీగల్ క్లినిక్‌లు ఎంతో ఉపయోగ పడతాయని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభి రామారావు అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే అధ్యక్షత మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మనోన్యాయ్ లీగల్ సర్వీస్ క్లినిక్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మానసిక వికలాంగులకు న్యాయసేవలు ముఖ్యంగా సైకియాట్రి సేవలు, ఆధార్, సోషల్ ఎంటైటిల్ సదుపాయాలు అందించేందుకు తగిన చర్యలు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చేపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, అనితా రెడ్డి, డాక్టర్ ఎస్. స్సాగ్నిక్ ముఖర్జీ, డాక్టర్ కె. ప్రహసిత్, సీడబ్ల్యూసీ సభ్యుడు సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్‌చార్జ్ ఎస్.ప్రవీణ్ కుమార్, మల్లికాంబ నిర్వాహకురాలు బండ రామలీల, పద్మ, శ్రీకాంత్. సీనియర్ న్యాయవాది గోపు వనజ పాల్గొన్నారు.
కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డులో..
విద్యారణ్యపురి: కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డులోని శంకర్‌నగర్‌లో వారిధి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌ను హనుమకొండ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.అపర్ణదేవి శనివారం ప్రారంభించారు. హనుమకొండ జిల్లా న్యాయసేవాధికారి సంస్థ సెక్రటరీ క్షమాదేశ్‌పాండె, కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వలంటీర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.