
‘ఐనవోలు’ పునరుద్ధరణ పనుల పరిశీలన
మల్లన్నను దర్శించుకున్న
రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు కె.అర్జున్‌రావు, డిప్యూటీ డైరెక్టర్లు నర్సింగరావు, నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ డి.బుజ్జి సందర్శించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు వారిని ఆహ్వానించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈసందర్భంగా ఆలయం నుంచి గతంలో ప్రతిపాదించిన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. తూర్పు, దక్షిణ ఆర్చ్‌గేట్ల మరమ్మతు, బాదామి చాళుక్యుల కాలంనాటి శిఽథిలమైన నిర్మాణ పునరుద్ధరణ, నాట్య మండపం, ఆలయంలో నీరు కురవడం, డ్రెయినేజీ ఏర్పాటు తదితర పనుల ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయించి పురాతన ఆలయానికి రూ.2కోట్ల వరకు పనులు చేయిస్తామని పురావస్తు శాఖ అధికారులు తెలిపారని ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, నందనం మధు శర్మ, సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.