
నేడు నరకాసుర వధ
● ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ, ఏఎస్పీ
సాక్షి, వరంగల్ /ఖిలా వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం నరకాసుర వధ ఉత్సవం జరగనుంది. పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాలతో డీసీపీలు, ఏసీపీ శుభం ప్రకాశ్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా వాహన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6గంటలనుంచి వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆ తరువాత ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 56 అడుగుల నరకాసుర ప్రతిమను మంత్రి కొండా సురేఖ స్విచ్ ఆన్ చేసి బాణసంచాతో దహనం చేయనున్నారు. పలు ప్రభుత్వ శాఖల సహకారంతో చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఏఎస్పీ శుభ ప్రకాశ్, ఉత్సవకమిటీ అధ్యక్షుడు మరుపల్లి రవి, ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేష్, ఏఈ సుకృత, తహసీల్దార్ ఇక్బాల్, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ పరిశీలించారు.