
వరంగల్
న్యూస్‌రీల్
ఆశన్నను ఎప్పుడూ చూడలేదు..
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
వెంకటాపురం(ఎం): మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నను తామెప్పుడూ చూడలేదని నర్సింగాపూర్ గ్రామస్తులు పేర్కొన్నారు. ఆశన్న లొంగిపోయిన విషయం టీవీల్లో మాత్రమే చూశామని వారు తెలిపారు. హనుమకొండలోని గోపాలపూర్‌లో నివాసముంటున్న ఆశన్న సోదరుడు సహదేవరావు దగ్గర తల్లి సరోజన ఉంటుందని పేర్కొన్నారు. ఆశన్న అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తమకు తెలియదని, జనజీవన స్రవంతిలో కలవడం సంతోషంగా ఉందని వివరించారు.