
భవన మరమ్మతు పనులను పూర్తిచేయాలి
● డీఈఓ రంగయ్య నాయుడు
కాళోజీ సెంటర్: వరంగల్ ఎల్‌బీ నగర్‌లోని భవిత సెంటర్‌ను భవిత జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్‌తో కలిసి డీఈఓ రంగయ్య నాయుడు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మౌలాలి ప్రాథమిక పాఠశాలలోని భవిత సెంటర్‌లో జరుగుతున్న భవన మరమ్మతు పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల (సీడబ్ల్యూఎస్‌ఎన్)తో కొద్దిసేపు మాట్లాడారు. మౌలాలి ప్రభు త్వ ఉన్నత పాఠశాల, మాసూమ్ అలీ పాఠశాల ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, ఉపాధ్యాయుల సెలవు పత్రాలు, విద్యార్థుల పురోగతి, తల్లిదండ్రుల సమావేశాలు వంటి అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం జయబాల రెడ్డి, ప్రాథమిక పాఠశాల మౌలాలి హెచ్‌ఎం జోసెఫ్, భవిత సెంటర్ సమ్మిళిత విద్యా ఉపాధ్యాయులు స్వాతి పాల్గొన్నారు.