‘విజిలెన్స్‌’లో అక్రమార్కుడు | - | Sakshi
Sakshi News home page

‘విజిలెన్స్‌’లో అక్రమార్కుడు

Oct 17 2025 5:42 AM | Updated on Oct 17 2025 5:42 AM

‘విజిలెన్స్‌’లో అక్రమార్కుడు

‘విజిలెన్స్‌’లో అక్రమార్కుడు

‘విజిలెన్స్‌’లో అక్రమార్కుడు

వరంగల్‌ క్రైం: ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిని ఎండగట్టి.. అక్రమార్కులపై చర్యలకు సిఫార్సు చేసే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఓ అక్రమార్కుడు అడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా నడుస్తోంది. విజిలెన్స్‌లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారికి నమ్మిన బంటైన సదరు కానిస్టేబు ల్‌ను ఏరి కోరి డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నారు. ఇంకా ఏముంది వసూళ్లకు పెట్టింది పేరైన సదరు కానిస్టేబుల్‌ పేరు చెబితే డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులకు కూడా చెమటలు పడుతున్నాయంటే ఆయన లీలలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు విచారణలు, తనిఖీలకు ప్రాధాన్యం ఉన్న విజిలెన్స్‌లో ఈ అక్రమార్కుడి సంపాదన మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇసుక క్వారీలు, రైస్‌ మిల్లులు, గ్రానైట్‌ క్వారీలు, ఫర్టిలైజర్స్‌, ఇలా ఎక్కడ చూసినా తన చేతికి పనిచెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎంత చెబితే అంత!

ఉద్యోగం కానిస్టేబులే అయినప్పటికీ పెత్తనం మాత్రం అంతా ఇంతా కాదు. ఆ శాఖలో పనిచేస్తున్న పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం ఇతగాడి నోటి నుంచి ఏం వస్తుందో.. దాని వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో.. అనే భయంతో వణికిపోతున్నట్లు సమాచారం. తనను ఏరి కోరి తెచ్చుకున్న బాస్‌కు అన్నీ తానై చేయడంతో మిగి లిన అధికారులంతా గప్‌చుప్‌గా ఉంటున్నారు. మట్టి, ఇసుక, గ్రానైట్‌ లారీలను పట్టాలన్నా.. వాటి కి జరిమానా విధించాలన్న ఆయన కనుసన్నల్లోనే జరగడం గమనార్హం. తనకు అనుకూలంగా ఉండే లారీల యజమానులకు ముందస్తుగా తనిఖీల సమాచారాన్ని చేరవేసి.. దానికి కాసుల రూపంలో ప్రతిఫలాన్ని పొందడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరైనా విజిలెన్స్‌ కార్యాలయంలో అధికారులను కలవాలంటే ముందుగా ఇతడిని ప్రసన్నం చేసుకున్న తర్వాతే దర్శనం దొరుకుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సంబంధం లేకుండా ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లి ఆయన పనులు గుట్టు చప్పుడు కాకుండా చేసుకుపోతున్నట్లు తెలిసింది.

వసూళ్లలో దిట్ట

పేరుకే కానిస్టేబుల్‌.. పెత్తనం పెద్దది

లీకులకు పెట్టింది పేరు

అక్కడ ఆయనే బాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement