
హైదరాబాద్ నుంచి వస్తుంది వాస్తవమే..
ఎంజీఎం: ‘వారానికి రెండు రోజులే’ శీర్షికన సాక్షిలో ప్రచుతరితమైన కథనంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్ స్పందించారు. సాధారణ బదిలీల్లో భాగంగా కొంత మంది వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వచ్చి వెళ్తూ విధులు నిర్వర్తిస్తున్న విషయాన్ని ఆయన అంగీకరించారు. ప్రతీరోజు క్రమం తప్పకుండా విధులకు వస్తూ ఓపీ విభాగంలో రోగులకు సేవలందించడంతో పాటు మధ్యాహ్నం సమయంలో ఎంజీఎం ఆస్పత్రితో పాటు కళాశాల ప్రాంగణంలో వైద్యవిద్యార్థులకు సంబంధించిన అకడమిక్ విభాగాల్లో సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల అటెండెన్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. వైద్య బోధన చేసే వైద్యులంతా తమ పేర్లతో పాటు ఫేస్ బేస్డ్ బయోమెట్రిక్ విధానానికి అనుసంధానం జరిగిందని తెలిపారు. కాగా, నిబంధనల ప్రకారం అత్యసవర పరిస్థితుల్లో ప్రాణాలు అందించే వైద్యులు హైదరాబాద్ నుంచి విధులకు రావొచ్చా? హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలా? అనే నిబంధన ఉందా.. అనే అంశంపై రాష్ట్ర స్థాయి అధికారులను అడిగి తెలుపుతామని సూపరింటెండెంట్ కిశోర్ పేర్కొన్నారు.
విధులకు రాని రోజు సెలవు
తీసుకుంటున్నారు
ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్