
దీపావళి పండుగకు ప్రత్యేక రైళ్లు
ఈనెల 20 నుంచి 10 సర్వీస్‌లు
కాజీపేట రూరల్: దీపావళి పండుగను పురస్కరించుకుని దర్బాంగా–యశ్వంత్‌పూర్ మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే ఈ రైళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 11 వరకు ప్రతీ సోమవారం దర్బాంగా–యశ్వంత్‌పూర్ (05541) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్‌కు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా అక్టోబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు యశ్వంత్‌పూర్–దర్బాంగా (05542) వెళ్లే ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. 3–ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్, సెకెండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీసులకు అప్ అండ్ డౌన్ రూట్‌లో సమస్థిపూర్, ముఝఫర్‌పూర్, హాజీపూర్, సోనాపూర్, చాప్రా, గ్రామీణ్, సివన్, డోరియోసాదర్, గోరఖ్‌పూర్, గోండా, బారబంకి, అశీశ్‌బాగ్, కాన్‌పూర్‌సెంట్రల్, ఓరియా, వీజీఎల్ ఝాన్సీ, బీనా, బోఫాల్, ఇటార్సీ, జోద్‌పూర్, కాబిన్, ఆమ్లా, నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట జంక్షన్, కాచిగూడ, మహబూబ్‌నగర్, దోనే, ధర్మవరం, హిందుపూర్, ఎలహంకా స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించారు.