
బైక్ అదుపు తప్పి రైతు మృతి
పరకాల: కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి పరకాల మున్సిపాలిటీ పరిధి సీతారాంపూర్‌కు చెందిన రైతు మేకల బాపురావు(55) గురువారం మృతి చెందాడు. బాపురావు బైక్‌పై యూరియా బస్తా వేసుకుని పొలానికి వెళ్తుండగా.. రాజీపేట వద్ద కుక్క అడ్డు వచ్చింది. అతడి వాహనం అదుపుతప్పడంతో తలకు బలమైన గాయమైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బాపురావు మృతి చెందాడు. కాగా.. హెల్మెట్ పెట్టుకుని ఉంటే బతికేవాడేమో అని స్థానికులు చర్చించుకున్నారు. పరకాల పోలీసులు కేసు నమోదు చేశారు.