
యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: బల్దియా ఆవరణలోని ప్లానిటోరియం పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీర్లను ఆదేశించారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులు బుధవారం మేయర్ తనిఖీ చేసి, ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాధికారులతో సమీక్షించారు. 15వ ఫైనాన్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతితో పాటు ప్లానిటోరియం పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ సత్యనారాయణ, అకౌంట్స్ అధికారి శివలింగం, జేఏఓ సరిత, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, మహేందర్, డీఈలు కార్తీక్‌రెడ్డి, రోజారాణి, రాగి శ్రీకాంత్, ఏఈ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.