పరకాల: ఇళ్ల ఎదుట మురుగునీరు, అస్తవ్యస్తమైన డ్రెయినేజీలతో దోమలు వృద్ధి చెంది జ్వరాలబారిన పడిన పరకాల మున్సిపాలిటీ ప్రజల కష్టాలు తీరాయి. తెలంగాణ అర్బన్ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్‌డీసీ) నుంచి రెండో విడత మంజూరైన రూ.15 కోట్ల నిధులతో పరకాల పట్టణంలో డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. దీంతో 30 సంవత్సరాలుగా వేధిస్తున్న డ్రెయినేజీ సమస్య పరిష్కారం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.10.50 కోట్లతో పట్టణంలో సుమారు 10.5 కిలోమీటర్ల డ్రెయినేజీ, రూ.4.5 కోట్లతో మూడు కిలోమీటర్ల సీసీ రోడ్డు ని ర్మాణ పనులు చేపట్టారు. వర్షాకాలంలో ప్రజలు ఇ బ్బందులు పడకుండా డ్రెయినేజీ పనులు చేపట్టా లని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. దీందో ముంపు సమస్య ఉన్న ప్రాంతాల్లో 70 శాతం పనులు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో కాలనీల్లో పర్యటనకు వచ్చిన రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్నామని, చాలా సంవత్సరాల తర్వాత డ్రెయినేజీ సమస్య పరిష్కారమైందని ప్రజలు సంబురపడుతున్నారు.
సమస్య పరిష్కారమైంది..
వాస్తవానికి మా కాలనీలో 30 ఏండ్ల క్రితం డ్రెయినేజీ నిర్మాణం చేశారు. అప్పటి నుంచి మళ్లీ కొత్త డ్రెయినేజీల నిర్మాణ లేకపోవడంతో పాతవి మట్టిలో కూరుకుపోయాయి. దీంతో ఇళ్ల నుంచి మురుగునీరు బయటకు పోలేక ఇబ్బందులు పడ్డాం. కొత్త డ్రెయినేజీల నిర్మాణంతో సమస్య పరిష్కారమైంది.
– బాలాజీ రవి, వడ్లవాడ, పరకాల
వర్షకాలంలో మురుగునీరు వచ్చేది..
వర్షాకాలం వచ్చిందంటే చాలా భయపడేవాళ్లం. వర్షపునీటితో పాటు మురుగునీరు ఇండ్లలోకి చేరుకోవడం కారణంగా చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఈ విషయంపై సాక్షి ద్వారా అనేకసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నాం. కొత్త డ్రెయినేజీల నిర్మాణంతో సమస్యపోయి ఊపిరి పీల్చుకుంటున్నాం. – కురికాల జనార్దన్‌రావు,
బ్రాహ్మణవాడ, పరకాల
పరకాల పట్టణంలో
డ్రెయినేజీల నిర్మాణం
రూ.15 కోట్ల టీయూఎఫ్‌డీసీ
నిధులతో పనులు
30 ఏళ్ల తర్వాత
తీరిన డ్రెయినేజీ సమస్య
హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీల ప్రజలు
మురుగు.. ఇక కనుమరుగు
మురుగు.. ఇక కనుమరుగు