
కేయూలో ఇక ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో, వర్సిటీ కాలేజీల్లోనూ తొలుత అధ్యాపకులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) అటెండెన్స్‌ను అమలుచేయనున్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీలోని అకాడమిక్ కమిటీ హాల్‌లో కాలేజీల ప్రిన్సిపాళ్లతో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ డిజిటల్ కన్సార్టియం ప్రతినిధులు హాజరై ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ పరికరాలు, మొబైల్ సిస్టమ్‌లో అటెండెన్స్ తీసుకునే విధానంపై డెమో ఇచ్చి అవగాహన కల్పించారు.
తొలుత మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో..
క్యాంపస్‌లోని మహిళా ఇంజనీరంగ్ కాలేజీలో పైలెట్ ప్రాజెక్టుగా ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో పరికరాలను కళాశాలలో ఏర్పాటుచేయనున్నారు. ఆ తరువాత టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తరువాత విద్యార్థులకు కూడా వర్తింపజేస్తారు. వెంటనే మిగతా యూనివర్సిటీ కళాశాలల్లో, వివిధ విభాగాలల్లో అమలు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా కొద్దిరోజుల్లోనే పూర్తిచేయాలనే యోచనలో యూనివర్సిటీ అధికారులు ఉన్నారు.
సమయపాలన పాటించడం లేదని..
కేయూలో టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు సమయం పాలన పాటించడం లేదు. అలాగే వివిధ విభాగాల్లో, కాలేజీల్లో విద్యార్థులు కూడా కొందరు సరిగా తరగతులకు హాజరుకావడం లేదు. ఇప్పటికే పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్ సత్ఫలితాలిస్తున్న నేపథ్యంలో సంబంధిత ఉన్నత విద్యాశాఖ అధికారులు వర్సిటీల్లోనూ ఎఫ్‌ఆర్‌ఎస్ అటెండెన్స్‌ను అమలుకు చేయాలనే ఆదేశించారు. దీంతో కాకతీయ యూనివర్సిటీలో అమలు చేయనున్నారు.
తొలుత టీచింగ్, నాన్‌టీచింగ్
ఉద్యోగులకు
ఆ తర్వాత విద్యార్థులకు కూడా..
పైలెట్ ప్రాజెక్టుగా మహిళా
ఇంజనీరింగ్ కళాశాలలో అమలు