
మరో ఇద్దరి అరెస్ట్
ధాన్యం కొనుగోళ్లలో
వెలుగుచూస్తున్న అక్రమాలు
శాయంపేట: మండలంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన మరో ఇద్దరు వ్యక్తులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు శాయంపేట సీఐ రంజిత్ రావు, ఎస్సై పరమేశ్ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీల్లో తేలిందని పేర్కొన్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడైన బెజ్జంకి శ్రీనివాస్ సడ్డకుడు వరంగల్ కొత్తవాడకు చెందిన వడ్లూరి రాజేందర్, ప్రధాన నిందితుడికి సహకరించిన మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన బండ లలితను పట్టుకొని వారి వద్ద ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రంజిత్‌రావు తెలిపారు.
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ క్యాంపస్‌లో ఓ విద్యార్థిపై బుధవారం కుక్కలు దాడి చేశాయి. తీవ్రగాయాలపాలు కాగా చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్యాంపస్‌లోని హాస్టల్, తరగతి గదులతోపాటు ఆడిటోరియం ప్రాంతాల్లో కోతులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.