
సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు చేయాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల: సద్దుల బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలు జరుపుకునే పశువుల సంత ప్రాంగణంతోపాటు దామెర చెరువు కట్టను గురువారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. వర్షాల కారణంగా దామెర చెరువులో నీటి మట్టం పెరిగిపోయింది. కట్టపై బారికేడ్లు, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని పరకాల మున్సిపల్ అధికారులకు సూచించారు. పట్టణంలోని ప్రతీ వీధిలో లైటింగ్ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ, మున్సిపల్ ఏఈ రంజిత్, కాంగ్రెస్ పరకాల మండల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం
రాష్ట్రంలో ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గురువారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, ఆత్మకూరు, నడికూడ, దామెర మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పరకాల, నడికూడ మండలాల అధ్యక్షులు కట్కూరి దేవేందర్‌రెడ్డి, బుర్ర దేవేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
అనారోగ్యంతో మృతిచెందిన పెద్ద రాజిపేటకు చెందిన చేనేత కార్మికుడు ముదిగొండ రఘు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.