
అంత్యోదయ సిద్ధాంతం గొప్పది
హన్మకొండ: దీన్‌దయాళ్ ఉపాద్యాయ సూత్రం అంత్యోదయను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి అన్నారు. హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని గురువారం జరుపుకున్నారు. దీన్‌దయాళ్ చిత్రపటానికి సంతోశ్‌రెడ్డి, పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదన్నారు. ఇంటిగ్రల్ హ్యూమనిజం ఈ దేశానికి అత్యవసరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయంత్ లాల్, సీనియర్ నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయ్ చందర్‌రెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి, నాను నాయక్, రాంబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.