
ఈఎస్‌టీఐసీ సదస్సుకు సమ్మయ్య
కమలాపూర్: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్–2025 (ఈఎస్‌టీఐసీ) ప్రతిష్టాత్మక సదస్సుకు కమలాపూర్‌కు చెందిన డాక్టర్ పుల్లా సమ్మయ్య సీనియర్ సైన్స్, టెక్నాలజీ లీడర్స్ (45 సంవత్సరాలు పైబడిన) విభాగంలో ఎంపికయ్యారు. ఈ కాన్‌క్లేవ్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, టెక్నోక్రాట్లు, ఆవిష్కర్తలు పాల్గొంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. డాక్టర్ పుల్లా సమ్మయ్య ప్రస్తుతం హనుమకొండ జిల్లా అనంతసాగర్‌లోని ఎస్సార్ యూనివర్సిటీలో రీసెర్చ్, డెవలప్‌మెంట్ విభాగంలో డీన్‌గా పని చేస్తున్నారు.