చట్టబద్ధంగానే లంబాడీల రిజర్వేషన్లు | - | Sakshi
Sakshi News home page

చట్టబద్ధంగానే లంబాడీల రిజర్వేషన్లు

Sep 8 2025 4:36 AM | Updated on Sep 8 2025 4:36 AM

చట్టబద్ధంగానే లంబాడీల రిజర్వేషన్లు

చట్టబద్ధంగానే లంబాడీల రిజర్వేషన్లు

నర్సంపేట: చట్టబద్దంగానే లంబాడీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని ప్రొఫెసర్‌ సీతారాంనాయక్‌, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్‌ వాసూనాయక్‌ అన్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలో లంబాడీల ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాలులో ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీ, కోయ, గోండుల మధ్య చిచ్చు పెట్టే విధంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని లంబాడీలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇరువురిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నా రు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఉదయ్‌సింగ్‌, మనోజ్‌లాల్‌, సారంగపాణి, చేతిరాం, రాజ్‌కుమార్‌, గోల్య, రమేశ్‌, శంకర్‌, జగన్‌నాయక్‌, వినోద్‌, ల క్ష్మణ్‌, కొజ్జనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement