
సండే సందడి
ఖానాపురం మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. పాకాల సరస్సు మత్తడి పోస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పాకాలకు భారీగా తరలివచ్చారు. మత్తడి వద్ద స్నానాలు చేస్తూ పాకాల అందాలను సెల్ఫీ రూపంలో బంధించుకున్నారు. బోటింగ్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.
– ఖానాపురం
మత్తడి వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు
జలకాలాడుతున్న పర్యాటకులు