
రెండు పడక గదుల ఇళ్లకు మోక్షం ఎప్పుడు?
ఉమ్మడి వరంగల్‌కు మంజూరైన ఇళ్లు
(రెండు విడతలు)
26,284
నిర్మాణం పూర్తయినవి
10,939 (41.62 శాతం)
నిర్మాణానికి చేసిన ఖర్చు (సుమారుగా) రూ.860 కోట్లు
అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసినవి 4,874 (44.56 శాతం)
వరంగల్ తూర్పు నియోజకవర్గం దూపకుంటలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు
● మహబూబాబాద్ జిల్లాలో 5,567 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 2024 వరకు 2,503 మాత్రమే పూర్తయ్యాయి. అందులో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 1,256 మందికి పంపిణీ చేశారు. ఇంకా 3,064 ఇళ్లు వివిధ స్థాయిల్లో ఉండగా.. పూర్తయిన 2,503 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఇంకా 1,247 లబ్ధిదారులకు అందజేయడంలో కాలయాపన జరుగుతోంది.
● హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 790 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 520 ఇళ్లు నిర్మించారు. మర్రిపల్లిగూడెం, గూడూరులో 50 చొప్పున 100 ఇళ్లు, కమలాపూర్‌లో 320 నిర్మించారు. అయితే రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్, వాటర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొద్ది రోజులు కాలయాపన జరిగింది. ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు నిరూపయోగంగానే ఉన్నాయి.
మంజూరైన ఇళ్లలో పూర్తయినవి 41.62 శాతమే
పూర్తయిన ఇళ్లలో
పంపిణీ చేసింది 44.56 శాతం
చాలాచోట్ల శిథిలావస్థకు గృహాలు
వివిధ స్థాయిల్లో నిలిచినవి 11,245..
ఆ నిర్మాణాలపై నీలినీడలు
నెరవేరని పేదోళ్ల సొంతింటి కల..
‘ఇందిరమ్మ’పై అర్హుల ఆశలు

రెండు పడక గదుల ఇళ్లకు మోక్షం ఎప్పుడు?