వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Sep 7 2025 7:04 AM | Updated on Sep 7 2025 7:04 AM

వరంగల

వరంగల్‌

మొరాయిస్తున్న ఈవీ బస్సులు దేవాలయాల అభివృద్ధే ధ్యేయం – 8లోu

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025
వివిధ భాషల్లో 5వేల పుస్తకాలు, వందలాది జర్నల్స్‌, పురాతన స్క్రిప్ట్‌లు.. ఒకేచోట కొలువై ఉన్న ప్రొఫెసర్‌ గజ్జెల రామేశ్వరం ఇంటర్నేషనల్‌ నేచురోపతి లైబ్రరీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఇక.. అనేక మంది విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడనుంది. అరుదైన విజ్ఞాన సంపద ఉన్న ఈ ప్రకృతి గ్రంథాలయంతో ఇటీవల కాకతీయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. గత జూలైలో పుణే జాతీయ ప్రకృతి వైద్య సంస్థ కూడా పరస్పర ఒప్పందం చేసుకుంది. భారతీయ సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ అభివృద్ధి వ్యాప్తికి పరిశోధనలు, శిక్షణ వంటి విద్యా కార్యక్రమాల్లో పరస్పర ప్రయోజనాలు పొందనున్నారు. ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయం ప్రత్యేకతలు, విద్యార్థులకు ఉపయోగం, తదితర అంశాలపై ఈ వారం ప్రత్యేక కథనం.

వరంగల్‌ రీజియన్‌ పరిధిలో నడిచే ఎలక్ట్రికల్‌ బస్సులు సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్నాయి.

వాతావరణం

జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది.

దేవాలయాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం రేవంత్‌ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి కొండా సురేఖ అన్నారు.

కేయూ క్యాంపస్‌:

నుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలోని ఇంటర్నేషనల్‌ నేచురోపతి లైబ్రరీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో దేశ, విదేశీ భాషా గ్రంథాలు ఉన్నాయి. ప్రకృతివైద్యానికి సంబంధించిన 50 పత్రికలు లభిస్తాయి. కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం విశ్రాంత ఆచార్యులు గజ్జెల రామేశ్వరం 2018 జూలై 24న తన ఇంటిలోనే ఈ లైబ్రరీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైద్యంపై ఆసక్తి ఉన్నవారు ఈ లైబ్రరీలో ఉచితంగా ప్రవేశించి చదువుకునే అవకాశం కల్పించారు.

పుణే జాతీయ ప్రకృతివైద్య సంస్థతో..

పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థ గత జూలై 1న ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయ పరిశోధన కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యలక్ష్మి, రామేశ్వరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. పుణే జాతీయ ప్రకృతి వైద్యసంస్థలో ఆస్పత్రి ఉంటుంది. అక్కడి నేచురోపతి కోర్సుల విద్యార్థులకు క్లినికల్‌ రీసెర్చ్‌కు సంబంధించిన ప్రకృతి వైద్య విజ్ఞాన పుస్తకాలు, జర్నల్స్‌ ఇక్కడి లైబ్రరీ రీసెర్చ్‌సెంటర్‌లో ఉన్నాయి. ఆ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వినియోగించుకుంటారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలు, ప్రకృతి వైద్యులు తమ సంస్థను సందర్శించిన సమయంలో పరిశోధనల విజ్ఞాన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల వారిని తరచూ ఇక్కడికి పంపే అవకాశాలున్నాయి. ఇది హెల్త్‌ ఎడ్యుకేషన్‌ టూరిజానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

యోగా, హిస్టరీ, లైఫ్‌ సైన్సెస్‌ వారికి ఉపయుక్తం

కేయూ దూరవిద్యలో యోగా డిప్లొమా కోర్సు నడుస్తోంది. ఈ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు 300 వరకు ఉన్నాయి. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లోనూ నేచురోపతిపై ఒక పేపర్‌ ఉంది. సైకాలజీ విద్యార్థులకు మానసిక వైద్య విద్యకు సంబంఽధించి ప్రకృతి వైద్యపరంగా విజ్ఞానసంపద ఉంది. భారత ప్రకృతివైద్య చరిత్ర, ప్రకృతి వైద్య ఉద్యమ వైతాళికులు ఎవరు అనే అనేక అంశాలు, చారిత్రక పరంగా ప్రకృతి వైద్యవిధానం ఎలా వచ్చిందనే దానిపై హిస్టరీ విద్యార్థులు, పరిశోధనలకు ఈలైబ్రరీ రీసెర్చ్‌సెంటర్‌లో అనేక దేశ, విదేశాల పుస్తకాలు, జర్నల్స్‌ అందుబాటులో ఉన్నాయి. లైఫ్‌సైన్సెస్‌ పీజీకోర్సుల విద్యార్థులకు ఉపయోగపడే జ్ఞాన సంపద అందుబాటులో ఉంది.

ప్రకృతి వైద్యవిజ్ఞానం ప్రజాబాహుళ్యంలోకి..

మూడున్నర దశాబ్దాలుగా సేకరించిన అరుదైన ప్రకృతి వైద్యవిద్య, సాహిత్య విజ్ఞాన సంపదను అందుబాటులో ఉంచా. కేయూ, పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థతో మా లైబ్రరీ రీసెర్చ్‌ సెంటర్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. విజ్ఞాన సంపదను విద్యార్థులు, పరిశోధకులు ఉపయోగించుకోవాలి. – గజ్జెల రామేశ్వరం, ప్రకృతి

వైద్య లైబ్రరీ రీసెర్చ్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడు

ఇంటర్న్‌షిప్‌నకు కూడా..

ఈ ఎంఓయూతో ఎంఎల్‌ఐఎస్సీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు అవకాశం లభించింది. తొలుత ఒకటి రెండురోజుల్లోనే ఇద్దరు విద్యార్థులను ఆ లైబ్రరీ సెంటర్‌కు పంపనున్నాం. మా లైబ్రరీ సైన్స్‌ విభాగంనుంచి ఆ లైబ్రరీలో పుస్తకాల క్యాట్‌లాగ్‌, క్లాసిఫికేషన్‌కు విద్యార్థులు సహకారం అందిస్తారు. –డాక్టర్‌ రాధికారాణి, కేయూ లైబ్రరీ సైన్స్‌ విభాగం అఽధిపతి

వరంగల్‌1
1/9

వరంగల్‌

వరంగల్‌2
2/9

వరంగల్‌

వరంగల్‌3
3/9

వరంగల్‌

వరంగల్‌4
4/9

వరంగల్‌

వరంగల్‌5
5/9

వరంగల్‌

వరంగల్‌6
6/9

వరంగల్‌

వరంగల్‌7
7/9

వరంగల్‌

వరంగల్‌8
8/9

వరంగల్‌

వరంగల్‌9
9/9

వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement