
భారీ వర్షాలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
న్యూశాయంపేట : భారీ వర్షాల నేపథ్యంలో వరద సహాయక చర్యలపై హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిస్థితులపై సమీక్షించారు. ఆగస్టులో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారం అందించేందుకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అలాగే నేడు (మంగళవారం) నుంచి 6వ తేదీ వరకు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.