
కళలపై ఆసక్తి పెంచుకోవాలి
● డీఈఓ రంగయ్యనాయుడు
విద్యారణ్యపురి: విద్యార్థులు చదువుతోపాటు తమకు ఇష్టమైన కళలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు సూచించారు. వరంగల్ జిల్లాస్థాయి కళా ఉత్సవాన్ని వరంగల్‌లోని జేఎస్‌ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానసిక వికాసమే విద్యావికాసానికి పునాది అని చెప్పారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన వివిధ పాఠశాలల విద్యార్థులను రాష్ట్రస్థాయి కళాఉత్సవానికి ఎంపిక చేస్తామని తెలిపారు. కళా ఉత్సవంలో భాగంగా ఓకల్ సో, ఓకల్ మ్యూజిక్, ఇన్‌స్ట్రూమెంటల్ మ్యూజిక్ సో, నృత్య పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలైన వారికి డీఈఓ రంగయ్యనాయుడు ప్రశంస పత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ చలమల నాగేశ్వర్‌రావు, జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, మండల విద్యాశాఖాధికారి బత్తుల ప్రసాద్, జేఎస్‌ఎం పాఠశాల ప్రిన్సిపాల్ శివకుమార్, ఉపాధ్యాయలు, తదితరులు పాల్గొన్నారు.