
మారని అధికారుల తీరు
న్యూశాయంపేట: ప్రతీ సోమవారం వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వస్తున్న అర్జీలకు పరిష్కారం లభించడం లేదు. గ్రీవెన్స్‌కు వచ్చిన బాధితుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించినా పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో దూరం నుంచి ఎంతో ఆశతో జిల్లా కేంద్రానికి ఒకటికి నాలుగు సార్లు వచ్చినా తమగోడు అధికారులు వింటున్నారే తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినతులు స్వీకరించిన కలెక్టర్
ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి వినతులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులు సోమవారం స్వీకరించారు. గ్రీవెన్స్‌కు 120 దరఖాస్తులు రాగా, అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన 58, జీడబ్ల్యూఎంసీకి 29, మిగితా శాఖలకు చెందినవి 33 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, వ్యవసాయశాఖ జేడీ అనురాధ, ఆర్‌డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, ఆర్‌సీఓ అపర్ణ, డీడబ్ల్యూఓ రాజమణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెడచెవిన పెడుతున్న వైనం
కలెక్టర్ చెప్పినా, బాధితులు కాళ్లరిగేలా
తిరిగినా కానరాని పరిష్కారం
గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన
కలెక్టర్ సత్యశారద