
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
● రాష్ట్ర జూడో అసోసియేషన్
అధ్యక్షుడు కై లాష్ యాదవ్
ఖిలా వరంగల్: క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కై లాష్ యాదవ్, జిల్లా యువజన క్రీడా మండలి అధికారి సత్యవాణి అన్నారు. జాతీయ క్రీడావారోత్సవాల్లో భాగంగా జిల్లా నెహ్రూ యువ కేంద్రం, జిల్లా యువజన క్రీడా మండలి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలు ఆదివారం సాయంత్రం ఖిలా వరంగల్ కోటలో అట్టహాసంగా ముగిశాయి. ముఖ్యఅతిథిగా హాజరైనవారు సైకిల్‌ర్యాలీ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన క్రీడా పాలసీని అతి త్వరలో జిల్లాల వారీగా తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడా యూనివర్సిటీలను క్రీడా పాఠశాలలను నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఆనంతరం పలు క్రీడాపోటీల్లో రాణించిన విజేతలకు బహుమతులు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ దామోదర్, నెహ్రూ యువ కేంద్రం అన్వేష్, వేమ, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.