
రైతులను పట్టించుకోని ఎమ్మెల్యే
● మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
ఖానాపురం: నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే మాధవరెడ్డి కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియాపై రైతులకు భరోసా కూడా కల్పించకపోవడం బాధాకరం అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నర్సంపేట నియోజకవర్గంలో యూరియాపై కనీసం సమీక్ష కూడా నిర్వహించని ఏకై క ఎమ్మెల్యేగా మాధవరెడ్డి నిలుస్తారని ఎద్దేవా చేశారు. స్కూల్‌కు వెళ్లే పిల్లలు కూడా యూరియా కోసం క్యూలో నిలుచునే పరిస్థితి వస్తుందంటే ఏ స్థాయిలో యూరియా సమస్య ఉందో తెలుస్తుందన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 11,600 మంది రైతులకు 26.60కోట్ల బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. యూరియా అందించలేని అసమర్ధ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బందారపు శ్రీనివాస్, వల్లెపు శ్రీను, కోరె సుధాకర్, ఉపేందర్‌రెడ్డి, మౌలానా, మస్తాన్, పూలునాయక్, సునీత, వెంకన్న పాల్గొన్నారు.